Wednesday, April 2, 2025

అల్లుడిని పొడిచిన మామ

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః అల్లుడిని మామ కత్తితో పొడిచి గాయపర్చిన సంఘటన నగరంలోని యూసుఫ్‌గూడలో బుధవారం చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం…నాగరాజు, జ్యోతికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు దంపతుల మధ్య ఈ నెల 13వ తేదీ గొడవ జరిగింది. ఈ విషయం అతడికి వరుసకు మామ అయ్యే సాడేల్‌కు జ్యోతి చెప్పింది.

దీంతో ఆగ్రహం చెందిన సాడేల్ నాగరాజును కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన నాగరాజును గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాడేల్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News