Wednesday, January 8, 2025

నడిరోడ్డుపై కత్తులతో పొడిచి దారుణ హత్య… ఆ వ్యవహారమే కారణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడిని యువతి బంధువులు నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని జాఫ్రాబాద్‌లో సోమవారం చోటు చేసుకుంది. సల్మాన్ అనే 25 ఏళ్ల యువకుడికి రెండేళ్ల క్రితం ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అయితే వీరి మధ్య ఉన్న బంధాన్ని యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు.

అయినా వారు అవేవీ పట్టించుకోలేదు. వారి బంధాన్ని కొనసాగించారు. ఇది జీర్ణించుకోలేని యువతి కుటుంబ సభ్యులు యువకుడిని హతమార్చాలని పథకం రచించారు. ఈ క్రమంలో సోమవారం సల్మాన్ తన స్నేహితులతో కలిసి జాఫ్రాబాద్ ప్రాంతంలో వెళ్తుండగా అతనిపై యువతి తండ్రి మంజూర్, సోదరులు మోషిన్, మరో యువకుడు దాడి చేశారు. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సల్మాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News