Thursday, January 9, 2025

డ్యాన్సు చేయనందుకు దంపతులను కత్తితో పొడిచాడు

- Advertisement -
- Advertisement -

నాగపూర్: ఒక కుటుంబ వేడుకలో తనతో డ్యాన్సు చేసేందుకు నిరాకరించిన జంటను కత్తితో పొడిచాడో వ్యక్తి. మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా ఖర్సోలి గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

నామకరణాన్ని పురస్కరించుకుని ఖర్సోలి గ్రామంలో ఒక వేడుక జరిగింది. ఆ కార్యక్రమానికి అదే గ్రామానికి చెందిన సుఖ్‌దేవ్ యుకీ(55), ఆయన భార్య రేఖ(50) కూడా హాజరయ్యారు. అదే వేడుకలో వారి పక్కింట్లోనే నివసించే సుభాష్‌రావు పాటిల్(45) కూడా పాల్గొన్నాడు. కాగా.న.తనతోపాటు డ్యాన్సు చేయాలని యుకీని పాటిల్ అభ్యర్థించాడు. అందుకు ఆ జంట నిరాకరించింది. అయితే ఆతిథ్యం ఇచ్చినవ్యక్తి అభ్యర్థన మేరకు యుకీ, ఆయన భార్య డ్సాన్సు చేశారు. దీంతో మండిపడిన పాటిల్ యుకీ దంపతులను దుర్భాషలాడాడు. వారు ఇంటికి వయల్దేరిన సమయంలో పాటిల్ వారిని కత్తితో పొడిచాడు.

కత్తిపోట్లకు గురైన ఆ దంపతులను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పాటిల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News