- Advertisement -
డబ్బు విషయంలో చెలరేగిన వివాదంతో తోటి ఉద్యోగిని కంపెనీ పార్కింగ్ స్థలంలోనే కత్తితో పొడిచి హత్యచేసిన ఘ టన పుణేలో జరిగింది. 28 ఏళ్ల మహిళ మల్టీ నేషనల్ కం పెనీ కాల్ సెంటర్‌లో ఉద్యోగి. సహోద్యోగితో ఆర్థిక లావాదేవీల్లో వివాదం వచ్చింది. దీంతో కృష్ణ సత్యనారాయణ కనోజా అనే ఆమె సహచరుడు ఆఫీసు పార్కింగ్ స్థలంలో ఘర్షణ పడి, కోపంతో కత్తితో పలుమార్లు పొడిచారు.
వెంటనే ఆమెను ఇతరులు ఆస్పత్రితో చేర్చినా, ఆమె గాయాలతో చనిపోయింది. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. అంతకు ముందు ఆఫీసులోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో పార్కింగ్ ప్రాంతంలో కొందరు సహోద్యోగులు ఉన్నా ఎవరూ జోక్యం చేసుకోకపోవడం, కనీసం అ యువకుడిని నివారించక పోవడం గమనార్హం. కంపెనీ సీసీటీవీ కెమెరాలో ఈ దారుణం రికార్డు అయింది.
- Advertisement -