Sunday, December 22, 2024

చాయ్‌లో షుగర్ తక్కువ వేశాడని.. యజమానిని కత్తితో పొడిచి

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: చాయ్‌లో షుగర్ తక్కువ వేశాడని షాప్ ఓవనర్‌ని కస్టమర్ కత్తితో పొడిచిన సంఘటన కేరళ రాష్ట్రం మలపురమ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మునాఫ్ అనే వ్యక్తి తానూర్‌లో టీ స్టాల్ నడిపిస్తున్నాడు. సుబేర్ అనే కస్టమర్ టీ స్టాల్ వద్ద టీ తాగాడు. టీలో షుగర్ తక్కువగా వేశామని మునాఫ్‌తో గొడవకు దిగాడు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఇద్దరు కొట్టుకున్నారు. సుబేర్ అక్కడి నుంచి వెళ్లిపోయి మళ్లీ టీ స్టాల్ వద్దకు వచ్చి మునాఫ్‌తో గొడవకు దిగాడు. వెంటనే కత్తి తీసి మునాఫ్ కడుపులో రెండు మూడు సార్లు పొడిచి అక్కడి నుంచి సుబేర్ పారిపోయాడు. వెంటనే టీ స్టాల్ యజమానిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి సుబేర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News