Monday, December 23, 2024

గాంధారి పెద్ద వాగులో చిక్కుకున్న వ్యక్తి

- Advertisement -
- Advertisement -

గాంధారి : సోమవారం ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షానికి గాంధారి మండలంలోని మాతు సంగెం గ్రామ సమీపంలోని గాందారి పెద్దవాగు పొంగిపోర్లుతుంది. భారీ వర్షానికి ఉదృతంగా ప్రవహిస్తున్న పెద్దవాగులో గౌరి సంగయ్య అనే వ్యక్తి చిక్కుకున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురెందర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వాగులో చిక్కుకున్న వ్యక్తిని రక్షించడానికి పోలీస్, ఫైర్ సిబ్బంది సహాకారంతో సహాయ చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సదాశివనగర్ సిఐ రామన్, గాందారి ఎస్సై సుధాకర్, మండల ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News