Wednesday, January 22, 2025

పెనుభూతమైన అనుమానం.. భార్య బిడ్డలను చంపి భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కంటోన్మెంట్: అనుమానంతో కట్టుకున్న భార్యను, 11 నెలల చిన్నారిని హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి సంఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోయిన్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహారాష్ట్రలోని డె క్లూరు కీనీపోస్ట్ ప్రాంతానికి చెందిన గణేష్ సంగ్రామ్ (35), భార్య స్వప్న (30) ముగ్గురు కుమార్తెలు త్రివేణి (6) తనుశ్రీ (4) నక్షత్ర 11 నెలల పాపతో కలిసి కూరగాయా ల ఆటోను నడుపుకుంటూ న్యూబోయిన్‌పల్లి పెద్ద తొక్కట్టలో నివాసం ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో ఆదివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో భార్యతో పాటు 11 నెలల పాపను తాడుతో గొంతుకు బిగించి హత్య చేశాడు.

ఆపై తాను నివాసం ఉంటున్న ఇంటి యజమాని సువర్ణను నిద్ర లేపి తనకు రోడ్డు ప్రమాదం జరిగిందని, తన అమ్మనాన్నలకు తెలియజేయాలని చెప్పాడు. తన భార్యకు సైతం విషయం చెప్పవద్దని, భార్య ఆందోళన చెందుతుందని పేర్కొన్నాడు. అనంతరం 100కు డయల్ చేసి జరిగిన విషయం పోలీసులతో చెప్పి తాను సుచిత్ర దగ్గరలోని రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బోయిన్‌పల్లి పెదతోకట్ట ప్రాంతం ఉలిక్కిపడింది. పెద్ద ఎత్తున జనాలు సంఘటన స్థలానికి చేరుకొని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News