Friday, December 20, 2024

నిశ్చితార్థం క్యాన్సిల్.. అమ్మాయి తండ్రి వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వ్యక్తిపై అమ్మాయి తండ్రి వేధింపులకు పాల్పడడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని లాతుర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీహరి విఠల్ పోత్ఫాలే అనే 27ఏళ్ల యువకుడు చకుర్ తహసీల్‌లోని కధాలా గ్రామంలోని తన పొలంలో ఈ నెల 19న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడకి ఇటీవల ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది.

అయితే, కొన్ని కారణాలు వల్ల నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో అమ్మాయి తండ్రి, రూ.లక్ష డిమాండ్ చేస్తూ విఠల్ పోత్ఫాలేను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన విఠల్ పోత్ఫాలే ఆత్మహత్యకు పాల్పడాడు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులపై 306 సెక్షన్ తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు.

Also Read: కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి… ముగ్గురు మహిళలపై గ్యాంగ్ రేప్?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News