Sunday, December 22, 2024

ఆర్టీసి బస్సు టైర్ కింద పడి వ్యక్తి ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

కదులుతున్న బస్సు టైర్ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ లో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కొండాపూర్ చౌరస్తాలో ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న ఆర్టీసి బస్సు టైర్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అయితే, చికిత్స పొందుతూ అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతిచెందిన వ్యక్తిని వెస్ట్ బెంగాల్‌కు చెందిన బిసు రాజాబ్ గా పోలీసులు గుర్తించారు. ఘటన సమయంలో అక్కడున్న సిసిటీవి ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News