- Advertisement -
గోదావరిఖని: గోదావరిఖనిలోని మార్కండేయకాలనీలో నివాసముంటున్న మంద వెంకటేశం(31) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జిడికె 11వ గనిలో జనరల్ మజ్దూర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశంకు రెండు సంవత్సరాల కింద మాలతితో వివాహం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్థాలు రావడంతో గొడవలు కాగా పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలో భార్య వెళ్లిపోయిన తన పుట్టింట్లో ఉంటుందని మనస్థాపంలో తాను కిరాయి ఉంటున్న ఇంట్లోనే ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి మంద కొమురమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
- Advertisement -