Sunday, January 19, 2025

ఉరివేసుకొని యువకుని బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

ఉరివేసుకొని యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మండలంలోని చింతల్‌ఠాణా గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన బడుగు దినేష్(21) పదోతరగతి వరకు చదువుకొని కులవృత్తి ఐన మేకలు కాస్తు జీవిస్తున్నాడు.తన మేనమాన కూతురును వివాహం చేసుకుంటానని పెద్దల సమక్షంలో మాట్లాడుకున్న తర్వాత క్యాన్సల్ అయ్యింది.

దీంతో అమ్మాయి తరుపున వారు వేరే అబ్బాయితో నిశ్చితార్ధం చేశారు.తనతో పెళ్లి చేసుకుంటానన్న అమ్మాయికి వేరే అబ్బాయితో పెండ్లి అవుతోంది నాకు ఇంకా కావడం లేదంటూ కలత చెందాడు.ఎప్పటి లాగే మేకలను కాసేందుకు చింతల్‌ఠాణా గుట్టల్లోకి వెళ్లి తన సోదరునితో ఇదే విషయాన్ని తెలిపి ఫోన్‌లో ఐ మిస్‌యూ అంటూ మెసెజ్ పెట్టాడని తెలిపాడు.కలత చెందిన కుటుంబీకులు గుట్ట ప్రాంతాల్లో అతని కోసం వెతికారు.ఓ చెట్టుకు ఉరివేసుకొని కనిపించడంతో బోరున విలపించారు.మృతుని తండ్రి గొడుగు అంజయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News