Thursday, December 26, 2024

పదిరోజుల క్రితం అదృశ్యం.. నేడు

- Advertisement -
- Advertisement -

తిప్పర్తి ః పది రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి శవం మై తేలాడు ఈ సంఘటన శుక్రవారం రోజు తిప్పర్తి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని గడ్డి కొండారం గ్రామానికి చెందిన జాల ఆంజనేయులు (30) సంవత్సరాలు. గత నెల 24వ తారీఖున సాయంత్రం సోదరిడితో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు నుండి ఆచూకి కోసం వెతికిన కుటుంబ సభ్యులు దొరికడని భావించిన మృతుని భార్య, శ్రేయ  ఫిబ్రవరి 1న తిప్పర్తి పోలీస్‌స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది. కాగా శుక్రవారం అదే గ్రామ శివారులో చాకలి కుంటలో శవం ఉన్నట్లు స్థానిక రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడం తో మృతుడు ఇంటి నుంచి వెళ్లిన ఆంజనేయులు అని వారి కుటుంబ సభ్యులు గుర్తించారు.

మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తిప్పర్తి ఎస్సై వాస ప్రవీణ్ కుమార్ తెలిపారు. మృతునికి భార్య ,ఒక సంవత్సరం బాబు ఉన్నట్లు సమాచారం. మృతుడు ఇంట్లో కుటుంబ సభ్యులు తన భార్యతో కూడా సరైన విధంగా కలిసి ఉండకపోయేవాడని అందుకే తన భార్య కూడా పుట్టింటికి వెళ్లిందని గతం లో కూడా ఇంట్లో చెప్పకుండా వెళ్లి తిరిగి వచ్చేవాడని స్థానికులు తెలుపుతున్నారు. కానీ మృతుడికి చనిపోయే అంత సమస్యలు లేవని మృతుడి మృతి తమకు అనుమానం కలిగిస్తుందని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News