Monday, December 23, 2024

ప్లాట్‌లో మృతదేహం నగ్నంగా….

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఓ ప్లాట్‌లో మృతదేహం నగ్నంగా కనిపించిన సంఘటన న్యూఢిల్లీలోని సారాయి రోహిళ్ల ప్రాంతంలో జరిగింది. హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సరాయి బస్తీ ప్రాంతంలో జైపాల్ (35) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. జైపాల్ తన ప్లాట్‌ను క్లీన్ చేయాలని చంద్రవతి అనే మహిళను పిలిచాడు. ఆమె క్లీన్ చేస్తుండగా చంద్రవతి, జైపాల్ మధ్య గొడవ జరిగింది. ఆమెను జైపాల్ తీవ్రంగా కొట్టడమే కాకుండా వీడియో తీశాడు. ఆ వీడియో పలువురికి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తరువాత చంద్రవతి తన కుమారుడు ధీరజ్ (19), మరో యువకుడితో ప్లాట్‌కు వచ్చారు. జైపాల్ లేకపోవడంతో ఫోన్ చేసి రమ్మని కబురు పంపారు. జైపాల్ ప్లాట్‌కు రాగానే అతడిపై ముగ్గురు మూకుమ్మడిగా దాడి చేయడంతో ఘటనా స్థలంలో అతడు చనిపోయాడు. వెంటనే ముగ్గురు నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ కాల్, సిసి కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశామని డిసిపి సాగర్ సింఘ్ కల్సీ తెలిపాడు. సదరు మహిళ జైపాల్ కు వివాహేతర సంబంధం ఆయన కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News