Wednesday, January 22, 2025

ప్రేమించలేదని.. యువతిని గదిలో బంధించి వేడి నూనెతో చిత్రహింసలు

- Advertisement -
- Advertisement -

ఏలూరు: ప్రేమించలేదని ఓ యువకుడు ఇంజినీరింగ్ విద్యార్థినిని చిత్రహింసలు పెట్టాడు. గదిలో బంధించి ఆమె ఒంటిపై వేడి నూనె పోసి టార్చర్ చేశాడు. ఈ దారుణ సంఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో చోటుచేసుకుంది. నిందితుడిని అనుదీప్ గా గుర్తించారు. ప్రేమోన్మాది దాడిలో యువతికి చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి.

అనుదీప్ నుంచి తప్పించుకున్న యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం బాధితురాలు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News