Saturday, December 21, 2024

వీడెవడండీ బాబూ… ఈగకి ట్రైనింగ్ ఇచ్చాడు!(వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

రాజమౌళి తీసిన ఈగ మూవీ గుర్తుందా? గ్రాఫిక్స్ సహాయంతో ఈగ ను సృష్టించి, దాని చేత ఫీట్లు, ఫైట్లూ చేయించి, ప్రేక్షకులను అలరించాడాయన. అయితే నిజ జీవితంలో ఓ వ్యక్తి ఏకంగా ఈగకే ట్రైనింగ్ ఇచ్చి, దాని చేత రకరకాల ఫీట్లు చేయిస్తున్నాడు! కుక్క, పిల్లి, కొన్ని రకాల పక్షులకు ట్రైనింగ్ ఇచ్చి, పెంచుకోవచ్చు గానీ, ఈగకు ట్రైనింగ్ ఇవ్వడమేంటండీ బాబూ! అనుకుంటున్నారు కదా. కానీ వీడియో చూస్తే, మీకే అసలు విషయం తెలుస్తుంది.

వినడానికి విచిత్రంగా ఉన్నా, నిజంగానే ఓ వ్యక్తి ఈగకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. నెట్ లో దీని తాలూకు వీడియో వైరల్ అవుతోంది. ఓ ఈగ ఇంట్లోకి వచ్చి టైబుల్ పై వాలింది. అతను తన చేతి వేలితో టేబుల్ పై తడుతూ, ఎక్కడకు కావాలంటే అక్కడకు దాన్ని పంపిస్తున్నాడు. అంతేకాదు, ఓ చిన్న చక్రంలాంటిదాన్ని దానిముందు ఉంచితే, ఈగ ఆ చక్రాన్ని దొర్లించుకుంటూ పోయింది. ఆ ఈగ చేస్తున్న ఈ చమత్కారాలేంటో మీరూ చూసేయండి మరి!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News