Monday, December 23, 2024

రేవంత్ సిఎం కావాలని వ్యక్తి ఆత్మహత్యా యత్నం – హోటల్ ఎదుటే ఆందోళన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రేవంత్ రెడ్డి సిఎం కావాలంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ‘హోటల్ ఎల్లా’ వద్దకు కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకు రాగా, వారు ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాసేపటికి హోటలోలోకి దూసుకెళ్ళడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే ఓ యువకుడు రేవంత్ రెడ్డి సిఎం అవ్వాలని పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించాడు. కలగజేసుకున్న పోలీసులు పెట్రోల్ డబ్బా కింద పడేసి ఆత్మహత్యయత్నం చేసిన యువకుడిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News