- Advertisement -
న్యూఢిల్లీ: 19 ఏళ్ల యువతితో గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించడంతో కారులోకి లాగారు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెపై యాసిడ్ పోస్తానని బెదిరించిన సంఘటన ఢిల్లీలోని పాండవ్ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సూల్తాన్ పూర్ ప్రాంతంలో యువతి నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. వెంటనే సదరు యువతిని కారులో లాగారు. ఆమె ప్రతిఘటించడంతో యువతిపై యాసిడ్ పోస్తామని బెదిరించారు. వెంటనే యువతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెనుగులాటలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -