Sunday, January 19, 2025

ఐస్‌క్రీమ్ షాపులో మహిళపై అత్యాచారయత్నం…

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐస్‌క్రీమ్ షాపులో కేక్ కావాలని వెళ్లిన వ్యక్తి ఆ షాపులో ఉన్న మహిళపై అత్యాచారయత్నం చేసిన సంఘటన తమిళనాడులోని కోయమ్‌బత్తూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఐస్ క్రీమ్ షాపు షెటర్‌ను సగం వరకు ఓపెన్ చేసి ఓ మహిళ క్లీన్ చేస్తోంది. ఓ వ్యక్తి వచ్చి కేక్ కావాలని అడిగాడు. 10.30 గంటల తరువాత షాప్ ఓపెన్ చేస్తామని ఆమె బదులిచ్చింది. వెంటనే అతడు షాపులోకి చొరబడి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె అతడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమెపై అతడు దాడి చేశాడు. ఆమె వెంటనే కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. వెంటనే అతడు బైక్ ను స్టార్ట్ చేసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడి హెచ్ రాజ్ కుమార్‌గా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ తరలించామని పోలీస్ అధికారి పళనయ్‌మాల్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News