Thursday, January 9, 2025

ఆదివాసీ యువకునిపై మూత్ర విసర్జన (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్య ప్రదేశ్ లోని సిధి జిల్లాలో అమానవీయ సంఘటన జరిగింది. రోజువారీ కూలీ అయిన ఆదివాసీ యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఇదెప్పుడు జరిగిందో తెలీదు కానీ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై సంబంధిత నేరస్తుడిని ఎందుకు ఇంతవరకు అరెస్టు చేయలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నిందితుడు బీజేపీ ఎమ్‌ఎల్‌ఎకి అనుచరుడని, అందుకే అతడిని అరెస్టు చేయలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

ఈ వీడియో తన దృష్టికి వచ్చిందని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఇలాంటి హేయమైన చర్యలకు నాగరిక సమాజంలో చోటు లేదని మాజీ సిఎం కమల్‌నాథ్ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ ఆదివాసీలపై జరుగుతున్న అకృత్యాలు అంతం కావాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News