Monday, January 20, 2025

కెనడాలో విడ్డూరమైన స్ట్రీట్ ఫైట్! పామునే ఆయుధంగా చేసుకున్న వైనం!! (వీడియో)

- Advertisement -
- Advertisement -

టొరొంటో: కెనడాకు చెందిన టొరంటోలో ఓ విడ్డూరమైన వీధి పోరాటం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 11.50 గంటలకు డుండాస్ పశ్చిమ వీధి, మన్నింగ్ అవెన్యూ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కొండచిలువ పామునే ఆయుధంగా చేసుకుని దాడిచేసిన ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీధి నడి మధ్యలో ఓ వ్యక్తి తన పెంపుడు కొండచిలువను గిరగిరా తిప్పుతూ ఓ వ్యక్తి దాంతో వీర బాదుడు బాధేశాడు. బాధితుడు దాడి నుంచి తప్పించుకోడానికి ఎంతగానో ప్రయత్నించాడు. అయినా దాడికి దిగిన ఆ వ్యక్తి వీరావేశంతో రెచ్చిపోయాడు. ఆ తర్వాత కొన్ని సెకండ్లకే టొరొంటో పోలీస్ వాహనం అక్కడికి చేరుకుంది. ఇద్దరిని విడదీసి నేలపై పడుకోమని పోలీసు ఆదేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా ఆ పాము అక్కడి నుంచి పాకుకుంటూ పోయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News