Monday, January 20, 2025

టీకా సర్టిఫికెట్ల కోసం 90 సార్లు టీకా వేయించుకున్న వ్యక్తి

- Advertisement -
- Advertisement -

Man vaccinated 90 times for vaccination certificates

బెర్లిన్ : టీకాల ధ్రువపత్రాల కోసం, వాటి విక్రయం కోసం తూర్పు జర్మనీ లోని మగ్డేబర్గ్ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి ఏకంగా 90 సార్లు టీకా వేయించుకున్నాడు. గత కొన్ని నెలలుగా అనేక సార్లు టీకాలు వేయించుకున్న ఈ వ్యక్తి ఆదివారం వరుసగా రెండోరోజు కొవిడ్ టీకా కోసం సాక్సోనీ లోని ఐలెన్‌బర్గ్ లో వ్యాక్సిన్ సెంటర్‌కు వచ్చాడు. అక్కడి నేర విభాగానికి చెందిన పోలీసులు అతనిని గుర్తించారు. ఆరా తీయగా ఫోర్జరీ టీకా సర్టిఫికెట్లను విక్రయించడం కోసమే ఈ పనిచేసినట్టు తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. అతని నుంచి అనేక ఖాళీ టీకా కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ధ్రువ పత్రాలు విక్రయించాడా లేదా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. వివిధ రకాల కంపెనీలకు చెందిన టీకాలను వేసుకోవడంతో అవి అతని ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇంకా తెలియలేదు. కొవిడ్ విజృంభిస్తున్నా జర్మనీ లో టీకా వేసుకోడానికి చాలా మంది నిరాకరిస్తున్నారు. అయితే రెస్టారెంట్లు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ వంటి వాటికి వెళ్లాలంటే టీకా వేయించుకున్నట్టు పాస్‌లు చూపించాలి. దీంతో కొందరు నకిలీ ధ్రువపత్రాల కోసం ప్రయత్నించడం పరిపాటి అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News