Sunday, December 22, 2024

గంజాయి అమ్ముతున్న యువకుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు శనివారం పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి 250గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… గచ్చిబౌలి, ఎపిహెచ్‌బి కాలనీకి చెందిన సవదత్తి బసవ రాజప్ప ప్రమోద్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

వచ్చే డబ్బులు అతడి జల్సాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. దీనిలో భాగంగా తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News