Sunday, January 19, 2025

అక్రమంగా గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నల్లగొండ రూరల్‌: గత కొద్దిరోజులుగా పానగల్లు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద గంజాయి అమ్ముతున్నారనే సమాచారంపై నిఘాపెట్టిన పోలీసులు మంగళవారం ఉదయం ఎల్లమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన పానగల్లు రోడ్డు నందు గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ….నమ్మదగిన సమాచారం మేరకు నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ వేమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, పోలీస్ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్‌తో అనుమానాస్పదంగా వ్యక్తి సంచరిస్తుండగా, అతన్ని పట్టుకోగా అతనివద్ద పావుకిలో గంజాయి లభించినట్టు తెలిపారు.

ఎస్‌ఐ నిందితుడిని విచారించాగా తన పేరు దుంపల సాయికుమార్, 25సంవత్సరాలు, పానగల్ రోడ్డు శ్రీరాంనగర్ కాలనీకి చెందినవాడుగా తెలిపాడన్నారు. నల్లగొండ తహసీల్దార్ సమక్షంలో గంజాయి స్వాధీనం చేసుకుని నేరస్తుడు దుంపల సాయికుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు వారు తెలిపారు. నల్లగొండ టూటౌన్ పరిధిలో ఎవరైనా గంజాయి అమ్మడం, తాగడం కానీ చేస్తున్నట్లైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్‌ఐ అన్నారు. పిల్లల తల్లిదండ్రులు వారి ప్రవర్తన పట్ల అప్రమ్తతంగా ఉండాలని, ఎవరితో ఎక్కడెక్కడ తిరుగుతన్నారో తెలుసుకోవాలని, వారి చెడు ధోరణిపట్ల కఠినంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News