Wednesday, January 22, 2025

ఫాంహౌస్‌లో వ్యక్తి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

శంషాబాద్: ఫౌంహౌస్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన సోమవారం తెల్లవారుజామున శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. హత్యకు సంబంధించిన వివరాలు సిఐ శ్రీధర్ కుమార్ వెల్లడించారు. శంషాబాద్ మండల పరిధిలోని జుకల్ గ్రామ శివారులోని ఓ ఫౌంహౌస్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న వెంకట నాగరాజు, భార్య నాగమణితో కలిసి నాలుగు నెలల నుంచి నివాసం ఉంటున్నారు.

అయితే గత రా త్రి వెంకట నాగరాజు భార్య నాగమణి నిద్రపోతున్న సమయంలో ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి భార్య నాగమణి మొహం పై స్ప్రే జల్లడంతో సృహ తప్పి పడిపోయాడు.అనంతరం వచ్చిన ఇద్దరు భర్త నాగరాజు తల, మెడపై పదునైన ఆయుధంతో కొట్టి దారు ణంగా హత్య చేశారు. దీంతో బంధువు సత్యనారాయణ ద్వారా విష యం తెలుసుకున్న మృతుడి కొడుకు నాగరాజు పోలీసులు తెలిపాడు.

దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలిం చారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేపట్టామని సిఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News