- Advertisement -
హైదరాబాద్: హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. తలపై బండరాయితో కొట్టిన దుండగులు ప్రాణాలు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరు..? ఎవరు హత్య చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -