Monday, November 18, 2024

వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఆగంతకులు

- Advertisement -
- Advertisement -

Man was doused in petrol and set on fire

అతి త్వరలో నేరస్తులను పట్టుకుంటాం
అడిషనల్ ఎస్పీ మహేందర్

సిద్దిపేట/చేర్యాల : ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించి చంపిన ఘటన మండలంలోని వీరన్న పేట గ్రామ శివారులో చోటు చేసుకుంది. హుస్నాబాద్ ఏసీపీ ఇంచార్జీ అడిషనల్ ఎస్పీ మహేందర్, చేర్యాల సీఐ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వీరన్న పేట గ్రామ శివారులోని సోలమైల్ వెంచర్ అనుకొని ఉన్న చెట్ల పొదల్లో నుండి మంగళవారం ఉదయం పొగ రావడాన్ని గమనించిన స్థానికులు, వెంటనే వీరన్నపేట సర్పంచ్ కొండపాక బిక్షపతికి విషయం తెలియజేశారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో చేర్యాల ఎస్‌ఐ రాకేశ్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారని ఎవరో గుర్తు తెలియని ఆగంతకులు ఓ వ్యక్తిని పెట్రోల్ పోసి అతి దారుణంగా శవాన్ని గుర్తు పట్టకుండా కాల్చి వేశారని తెలిపారు. గుర్తు తెలియని శవం కింద కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే నింధితులను పట్టుకుంటామని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News