Friday, December 27, 2024

యువతి ప్రైవేటు వీడియోలు వైరల్… మనస్తాపంతో భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఇందారం: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో మంగళవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు ఓ యువకుడిని బండరాళ్లతో దారుణంగా హత్య చేశారు. ఇవాళ ఉదయమే నడిరోడ్డుపై బండరాళ్లతో యువకుడ్ని కుటుంబం కొట్టిచంపింది. మృతుడిని మహేశ్(24)గా గుర్తించారు. కొన్నాళ్లుగా యువతిని వేధిస్తున్నాడని మహేశ్ పై ఆరోపణలు ఉన్నాయి. ఏడాది క్రితం వరకు యువతి, మహేశ్ మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగిందని స్థానికులు తెలిపారు.

Also read: ఉపాసన,రామ్‌చరణ్‌కు పుట్టబోయేది బాబా, అమ్మాయా?

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు యువతికి ఆర్నెళ్ల క్రితం మరో యువకుడితో వివాహం జరిపించారు. యువతి తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో కోపోద్రిక్తుడైన నిందితుడు మహేశ్ యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోలను బహిర్గతం చేశాడు. దీంతో యువతి ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోలు బహిర్గతం కావడంతో మనస్తాపంతో యువతి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త చనిపోయిన తర్వాత యువతి తన పుట్టింటికి చేరుకుంది.

Also Read: ప్రధాని పోస్ట్ ఖాళీగా లేదు: షానవాజ్

మళ్లీ కొన్నాళ్లుగా యువతిని మహేశ్ వేధిస్తున్నాడని తెలుసుకున్న యువతి కుటుంబీకులు ఆగ్రహంతో కొట్టిచంపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News