- Advertisement -
కటక్ న్యూస్: అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఓ వ్యక్తిని బైక్‌కు కట్టి రెండు కిలో మీటర్లు లాక్కెళ్లిన సంఘటన ఒడిషా రాష్ట్రం కటక్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 15 వందల రూపాయలు అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో జగన్నాథ్ బెహ్రా అనే అతడి చేతులకు తాడు కట్టారు. అనంతరం ఆ తాడును బైక్‌కు కట్టేసి రెండు కిలో మీటర్లు అతడిని లాక్కెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లాక్కెళ్లిన ఇద్దరిపై మర్డర్, కిడ్నాప్ కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీస్ అధికారి పినాక్ మిశ్రా తెలిపాడు. బైక్‌తో పాటు తాడును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. జగన్నాథ్ నెల రోజుల్లో అప్పు తిరిగి చెల్లిస్తానని చెప్పిన కూడా వారు వినలేదని తన బాధను బాధితుడు వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి….
చందానగర్ లో భార్యను కత్తెరతో పొడిచి…. భర్త ఆత్మహత్య
సాదుకున్నందుకు చంపేసింది…
భార్య చేతి వేళ్లను నరికి…
ప్రేమోన్మాదానికి కూతురు, తండ్రి బలి
- Advertisement -