Monday, January 20, 2025

శివుడి వేషం… మెడలో ఉన్న పాము కాటువేయడంతో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

పాట్నా: దుర్గమ్మ వేడుకలో ఓ వ్యక్తి శివుడు లాగా వేషం వేసి అనంతరం మెడలో బతికి ఉన్న పామును చుట్టుకున్నాడు. పాము కాటువేయడంతో అతడు మృతి చెందిన సంఘటన బిహార్ రాష్ట్రం మెదపూర జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఖుర్ధ గ్రామంలో మా దుర్గ దేవాలయంలో అఖండ అష్టమ్ అనే పండుగ జరుగుతోంది. ముఖేష్ అనే వ్యక్తి శివుడి లాగా వేషం వేశాడు. మెడలో పాము వేసుకొని నాట్యం చేస్తుండగా అతడిని కాటు వేసింది. ఈవెంట్ ఆర్గనైజర్ వెంటనే అతడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ముఖేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో సదార్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ముఖేష్ చనిపోయాడు. అదే ఆస్పత్రి వద్ద మృతదేహాన్ని పడేసి ఘటనా స్థలం నుంచి ఈవెంట్ ఆర్గనైజర్ పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: పూర్ణానంద రిపోర్ట్‌లో సంచలన విషయాలు… గర్భం దాల్చిన బాలిక

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News