Wednesday, January 22, 2025

తల్లితో అక్రమ సంబంధం.. బాలుడి కిడ్నాప్.. హత్య

- Advertisement -
- Advertisement -

థాణె(మహారాష్ట్ర): ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తి ఆమె ఏడేళ్ల కుమారుడిని కిడ్నాప్ చేసి హతమార్చాడు. మహారాష్ట్రలోని కల్యాణ్ పట్టణంలో ఈ దారుణం సోమవారం చోటు చేసుకుంది. నిందితుడు నితిన్ కాంబ్లె సోమవారం స్కూలుకు వెళ్లిన ఆ బాలుడిని తరగతులు పూర్తయిన తర్వాత కిడ్నాప్ చేశాడు. సాయంత్రం దాటినా పిల్లవాడు ఇంటికి రాకపోవడంతో ఆ పిల్లవాడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు ఒక హౌసింగ్ కాంప్లెక్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో బాలుడి శవం లభించింది.

హత్య కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి గురించి కూపీ లాగగా అతడికి బాలుడి తల్లితో అక్రమ సంబంధం ఉండేదని తెలిసింది. వారిద్దరికీ గొడవ జరగడంతో ఆమె అతడిని దూరం పెట్టింది. దీంతో పగ తీర్చుకోవాలన్న కోపంతో నిందితుడు ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసి చంపి మృతదేహాన్ని స్విమ్మింగ్ పూల్‌లో పడేశాడు. నిందితుడు గతంలో ఇదే హౌసింగ్ కాంప్లెక్స్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసేవాడని పోలీసులు గుర్తించారు. స్కూలు నుంచి ఆ బాలుడిని నిందితుడు తరచు ఇంటికి తీసుకువచ్చేవాడని పోలీసులకు తెలిసింది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News