Wednesday, January 22, 2025

యూట్యూబ్ రేటింగ్‌కోసం విమానం కూల్చిన వ్యక్తి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : తన వీడియోలకు యూట్యూబ్‌లో వీక్షకుల సంఖ్య పెరిగేందుకు ఓ యూట్యూబర్ తాను ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చేశాడు. 2021 డిసెంబర్‌లో ట్రోవోర్ జాకోబ్ అనే యువకుడు విమానాన్ని కాలిఫోర్నియాలోని అడవుల్లో అత్యంతచాకచక్యంతో తానే నడుపుతున్న దశలో కూల్చేసి, తాను సురక్షితంగా తప్పించుకున్నాడు.

ఈ వ్యక్తి ఒలింపిక్ స్నోబోర్డ్ సభ్యుడు కూడా . ప్రమాదం జరిగిందని తెలిపి , ఆ తరువాత తాను విమానాన్ని కూల్చేశానని పేర్కొంటూ ఓ వీడియో వెలువరించాడు. ముందుగా ఇది ప్రమాదం అని తెలిపి, సంబంధిత ఘటన ఆధారాలను తుడిపేసి ఆ తరువాత వీడియోను పోస్టు చేసిన ఈ వ్యక్తికి ఇప్పుడు అమెరికా చట్టం ప్రకారం కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడే వీలుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News