Monday, March 10, 2025

పూణేలో బహిరంగంగా మూత్రం చేసిన వ్యక్తి క్షమాపణ

- Advertisement -
- Advertisement -

‘ఎద్దున్నోడికి బుద్ధి ఉండదు, బుద్ధి ఉన్నోడికి ఎద్దుండదు’ అనేది ఓ సామెత. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బాగా డబ్బున్నవారు కూడా ఒక్కోసారి చిల్లరగా వ్యవహరిస్తుంటారని చెప్పడానికి. విషయానికి వస్తే శనివారం పూణేలో ఓ ధనవంతుడు తన బిఎండబ్లు నుంచి దిగి అందరూ చూస్తుండగానే బహిరంగ ప్రదేశంలో మూత్రం చేసి, వాహనం నడిపించుకుంటూ వెళ్లిపోయాడు. దీని తాలూకు వీడియో వైరల్ కావడంతో ఆయనకు బుద్ధొచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే గౌరవ్ అహుజా అనే వ్యక్తి రోడ్డు మధ్యలో తన బిఎండబ్లు వాహనాన్ని ఆపి, డివైడర్‌కు సమీపంలో మూత్రం చేశాడు. కాగా కారులో బీర్ బాటిల్ పట్టుకుని కూర్చున్న మరో వ్యక్తిని భాగ్యేశ్ ఓస్వాల్‌గా గుర్తించారు. వీడియో వైరల్ కావడంతో ‘నేను గౌరవ్ అహుజాను, బహిరంగంగా నేను చేసింది తప్పే.

నేను ప్రజలకు, పోలీస్ శాఖకు, షిండే సాహేబ్‌కు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. మన్నించండి. నా కుటుంబ సభ్యులను బాధపెట్టకండి. మరో ఎనిమిది గంటల్లో నేను ఎరవాడ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతాను’ అని చేతులు జోడించి వేడుకుంటున్న వీడియోను పోస్ట్ చేశాడు. అందులో ‘షిండే సాహెబ్’ అన్నది ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించా అన్నది స్పష్టం కాలేదు. పోలీసులు రాత్రి 11.00 గంటలకు భాగ్యేశ్ ఓస్వాల్‌ను అరెస్టు చేశారు. కాగా కరాడ్‌లోని పోలీస్ స్టేషన్‌లో అహుజా లొంగిపోయాడు. వారిద్దరిని ఆదివారం ఉదయం మెడికల్ చెకప్‌కు తీసుకెళ్లారు. అది కూడా వారిద్దరూ తాగారా? అన్నది నిర్ధారించుకోడానికి. అహుజాను పోలీసులు ఆదివారం సాయంత్రం కల్లా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News