‘న్యూరాలింక్’ అనేది మస్క్ స్థాపించిన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్. దీని ఇంప్లాంట్ కంప్యూటర్‌ను నియంత్రించడానికి రోగి తన ఆలోచనలను ఉపయోగించుకునేలా చేస్తుంది. కంప్యూటర్‌లతో కనెక్ట్ అయ్యే మెదడు పరికరాలపై పనిచేసే ఏకైక సంస్థ న్యూరాలింక్ కాదు. ఎలోన్ మస్క్ కంపెనీ పేరు న్యూరాలింక్ కార్పొరేషన్.
న్యూరాలింక్ సిఈవో ఎలాన్ మస్క్ మరో వ్యక్తికి మెదడు చిప్ అమర్చినట్లు వెల్లడించారు. వెన్ను, మెదడు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయ పడేలా ఈ చిప్ ను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా ఎనిమిది మందికి ఈ చిప్ అమర్చనున్నట్లు మస్క్ ధ్రువీకరించారు. తన పాడ్ కాస్ట్ లో ఆయన ఈ వివరాలు పంచుకున్నారు.
మానవ మెదడులో తొలి చిప్ ను విజయవంతంగా అమర్చినట్లు జనవరి చివర్లో న్యూరాలింక్ ప్రకటించింది. కంప్యూటర్ తో మానవ మెదడును సమన్వయం చేసే ‘బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ ఫేస్’కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(FDA) 2023 మేలో ఆమోదం తెలిపింది. ఒక వ్యక్తిలో దాదాపు 10 చిప్ లను అమర్చొచ్చు. వాటిని అమర్చాక బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ ఫేస్(బిసిఐ) మొదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించే అల్గారిథమ్ లుగా మారుస్తుంది.
Livestream of @Neuralink demonstrating “Telepathy” – controlling a computer and playing video games just by thinking https://t.co/0kHJdayfYy
— Elon Musk (@elonmusk) March 20, 2024