Monday, December 23, 2024

ఆయుధాలతో మమత ఇంట్లోకి: వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలోకి ఆయుధాలు ఉన్న కారులో ప్రవేశించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇటీవల పంచాయతీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ హింసలో తమ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కాగా, బిజెపి వంటి ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇందుకు భిన్నమైన ప్రకటనలు చేశాయి.

పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అమరవీరుల దినోత్సవం కోసం టిఎంసి కార్యకర్తలు పెద్దసంఖ్యలో కోల్‌కతాలో శుక్రవారం మోహిరించిన నేపథ్యంలో బిజెపి కార్యకర్తలు ఇందుకు ప్రతిగా నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలోకి కారులో ాయుధాలు పెట్టుకుని చొరబడేందుకు ప్రయత్నించిన ొక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేకెత్తించింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియరావలసి ుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News