Thursday, January 23, 2025

బాలలతో పనిచేయిస్తున్న నిందితుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Man working with children was arrested

 

హైదరాబాద్ : బాలలతో పనిచేయిస్తున్న వ్యక్తిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని ఫలక్‌నూమాకు చెందిన షేక్ తఫీక్ వ్యాపారం చేస్తున్నాడు. బీహార్‌కు చెందిన 8మంది బాలురను తీసుకుని వచ్చి బ్యాగులు, సీట్ కవర్లు తయారీ యూనిట్‌లో పనిచేయిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో చైల్డ్ వెల్‌ఫేర్ అఫీషియల్స్, స్పెషల్ రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలిసి తయారీ యూనిట్‌పై దాడి చేశారు. అక్కడ పనిచేస్తున్న ఎనిమిది మంది బాలలకు విముక్తి కల్పించారు. బాలలతో పనిచేయిస్తున్న నిందితుడిని అరెస్టు చేసి ఫలక్‌నూమా పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఫలక్‌నూమా పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News