Monday, December 23, 2024

మన సిఎం… మన మంత్రి…. పాలమూరు ప్రజల సంతోషం….

- Advertisement -
- Advertisement -

జిల్లాలో సిఎంగా రేవంత్‌రెడ్డి,
మంత్రిగా జూపల్లి ప్రమాణ స్వీకారం
రెండో సారి మంత్రి వర్గ విస్తరణలో స్థానం దక్కేదెవరికి ? 8ఆశిస్తున్న యన్నం శ్రీనివాస్ రెడ్డి, వంశీ కృష్ణ
ఆరు గ్యారంటీలపై తొలి సంతకం
ప్రగతి కోసం ఎదరు చూస్తున్న
పాలమూరు, కొడంగల్ సంబురాలు
మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో: ఆయన ఒక ధైర్యం..మాటల మాంత్రికుడు.. పట్టువదలని విక్రమార్కుడు.. అన్నింటికి మించి దేన్నెనై ఎదురించే మనస్థత్వం….కేసులకు సైతం బెదరని నేత.. దూకుడు స్వభావం. ఇవన్ని కలగలపితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎక్కడ చూసినా, విన్నా ఆయన పేరే ..అందరి నోటా ఆ యన పేరే ..అన్ని సామాజిక మాద్యమాల్లో ఆయన పేరే మారుమ్రోగుతోంది. ఏనాడు తాను ముఖ్యమంత్రి అవుతానని కలలో కూడా ఊహించి ఉండడేమో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రాజకీయా ల్లో ఎవరి అండదండలు లేకుండా స్వయం కృషి తో, స్వతంత్రంగా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యే క ముద్ర వేసుకున్న నేతగా ఎదిగారు. కాలం కలి సి వస్తే ఏదైనా జరగవచ్చు. అందుకు

ఉదాహరణే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్తానం .

తన రాజకీయ ప్రస్తానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తు పల్లాలు చవి చూసి నేడు ఇంతటి పెద్ద స్థాయికి చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం 1 గంటకు రాజధానిలోని ఎల్‌బి స్టేడియంలో గవర్నర్ తమిళ సై సమక్షంలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రిగా కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మన పాలమూరు జిల్లా నుంచి ఒకరు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, మంత్రి గా జూపల్లి కృష్ణారావులు చరిత్రకెక్కారు.

రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్తానం…

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి 1969లో నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లెలో జన్మించారు. విద్యార్ధి దశలో ఎబివిపి నేతగా ఉన్నారు. 2006లో స్వతంత్రంగానే జడ్‌పిటిసిగా తన రాజకీయ అరంగ్రేటం చేశారు. అనంతరం 2007లో స్వతంత్ర అభ్యర్ధిగానే ఎంఎల్‌సిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 2009,2014లో కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధించారు. 2017 లో అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత పిసిసి వర్కింగ్ ప్రసిడెంట్‌గా కొనసాగారు. 2018లో కొడంగల్ నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్ధి పట్నం నరేంద్ర రెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజిగిరి ఎంపిగా గెలుపొందారు. 2021లో జూన్‌లో టిపిసిసి ఛీప్‌గా ఎన్నికయ్యారు. 2023లో కామారెడ్డి, కొడంగల్‌లో పోటీ చేసిన రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోగా కొడంగల్‌లో విజయం సాధించారు. డి సెంబర్ 7న గురువారం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఆయన గెలిచిన కొడంగల్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సంబురాలు జరుపుకున్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు రాజకీయ ప్రస్తానం …

కొల్లాపూర్ రాజకీయాల్లో తన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ జూపల్లి కృష్ణారావు సిఎం రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఆయన వరుసగా1999, 2004, 2009, 2012, 2014 వరుసగా ఐదు సార్లు విజయం సాధించా రు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డి, కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుల మంత్రి వర్గంలో కూడా జూపల్లి కీలకమైన మంత్రిత్వ శాఖలో పని చేశారు. 2023 ఏప్రిల్‌లో బిఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన జూపల్లి కాంగ్రెస్‌లోకి చేరి 2023లో జరిగిన ఈ ఎన్నికల్లో విజయం సాధించి మంత్రిగా చోటు దక్కించుకున్నారు., జూపల్లి ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ ప్రముఖుల్లో ఆయన ఒకరుగా ఉన్నారు.

రెండవ మంత్రి వర్గ విస్తరణలో చోటును ఆశిస్తున్న యన్నం…

మొదటి మంత్రి వర్గ విస్తరణలో పాలమూరు జిల్లా నుంచి కేవలం జూపల్లి కృష్ణరావు ఒక్కరికే దక్కింది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్‌రెడ్డికి చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అలాగే అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు కూడా చోటు దక్కే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జూపల్లి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా, యన్నం శ్రీనివాస్ రెడ్డి, వంశీ కృష్ణలు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మిగిలిన వారంతా కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వారే ఉన్నారు. దీంతో మంత్రి వర్గ విస్తరణలో చోటు కోసం యన్నం,వంశీకృష్ణలు ఆశిస్తున్నారు. పాలమూరు జిల్లా నుంచి కెసిఆర్ క్యాబినెట్‌లో శ్రీనివాస్‌గౌడ్ కీలకమైన మంత్రిత్వ శాఖ చేశారు. దీంతో పాలమూరు నుంచి కూడా యన్నం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు దక్కితే మరింతగా పాలమూరు పట్టణంతో పాటు నియోజకవర్గం అభివృద్ది జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు

ఆరు గ్యారెంటీలపై నెలకొన్న ఉత్కంఠ

కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై జిల్లా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
1. మహాలక్ష్మి పథకం కింద మహిళలలకు రూ. 2500 ఆర్దిక సహాయం, రూ. 500 గ్యాస్ సిలిండర్, ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణఱం. 2.రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ. 15 వేలు,3 ఇందిరమ్మ గృహనిర్మాణం కింద ఇళ్లు లేనివారికి ఇంటి స్థలాలు, 5ల క్షలు ఇంటినిర్మాణంకు సహాయం 4.గృహజ్యోతి కింద రూ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,5 యువ వికాసం కింద విద్యార్దులకు రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు 6 చేయూత కింద అర్హులకు రూ. 4 వేలు ఫించన్లు ఈ ఆరు గ్యారెంటీలు ఉన్నాయి. గురువారమే సిఎం అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆరు గ్యారెంటీలపై చర్చ జరిగింది. దీంతో త్వరలో ఆరు గ్యారెంటీలు అమలు అయే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News