Thursday, January 23, 2025

గిరిజన ప్రగతికి చిరునామా మన హుస్నాబాద్

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

హుస్నాబాద్: గిరిజనుల సంక్షేమానికి వారి సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభు త్వం సిఎం కెసిఆర్ ఆద్వర్యంలో ఎనలేని కృషి చేస్తుందని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శనివారం తెలంగాణ గిరిజన దినోత్సవం జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలోనే గిరిజన ప్రజలకు చిరునామాగా మన హుస్నాబాద్ నిలుస్తుందన్నారు. గిరిజనులు అత్యధికంగా ఉన్న హుస్నాబాద్ నియోజక వర్గంలో సుమారు 3 కోట్ల వ్యయంతో జిల్లాలోనే ఏకైక బంజారా భవనంను నియోజక వర్గ కేంద్రంలో నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. నియోజక వర్గంలో దాదాపు 12 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అంతే కాకుండా ప్రతిగిరిజన తండాకు రోడ్డు నిర్మాణం, విద్యుత్ సౌకర్యం మిషన్ భగిరధనీరు అందించడంతో పాటు అన్నా రకాల సంక్షేమ అభివృద్ది ఫలాలు అందివ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకే ఆదివాసి పండుగలను , జాతరలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ దిశా నిర్ధేశంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన పథకాలు, కార్యక్రమాలతో గిరిజనులు సాధిస్తున్న అభ్యున్నతి, తెలంగాణ కీర్తిని నలుదిశలా ఎలుగెత్తి చాటుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News