Friday, April 4, 2025

దశాబ్దాల కలను ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చింది: నారా లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎంటిఎంసిలో ఉన్న మిగిలిన గ్రామాలు, తాడేపల్లి, మంగళగిరి పట్టణాల్లో సిఆర్ డిఎ పరిధి కింద పనులు పూర్తి చేస్తామని ఎపిమంత్రి నారా లోకేష్ తెలిపారు. భూగర్భ డ్రెయినేజీ తాగునీరు, అండర్ గ్రౌండ్ విద్యుత్ అమరాతి మాస్టర్ ప్లాన్ కింద జరుగుతుందని అన్నారు. మంగళ గిరి నియోజక వర్గం ఉండవల్లిలో నారా లోకేష్ మాట్లాడారు.. దుగ్గిరాలకు వచ్చేసరికి ఆర్ డబ్ల్యూఎస్ కింద పనులు పూర్తవుతాయని తెలియజేశారు. అంతిమంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యమని వెల్లడించారు. రెండున్నర దశాబ్దాల కలను ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు.

విజనరీకి, ప్రిజనరీకి చాలా తేడా ఉందని ఎద్దేవా చేశారు. మంగళ గిరి నియోజక వర్గం ఉండవల్లిలో ‘ మన ఇల్లు- మన లోకేష్’ కార్యక్రమం చేపట్టారు. గోవిందు, సీతామహాలక్షి దంపతులకు తొలి శాశ్వత ఇంటి పట్టా నారా లోకేష్ అందజేశారు. మంగళగిరిలో దశాబ్దాల సమస్యకు 10 నెలల్లో పరిష్కారం చూపించారు. మొదటి విడతలో ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న 3 వేల మందికి శాశ్వత పట్టాలు అందజేశామన్నారు. స్వయంగా లబ్దిదారుల నివాసానికి వెళ్లి పట్టా అందజేసేలా నారా లోకేష్ ప్రణాళికలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News