అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ గవర్నెన్స్ శక్తికి ‘మన మిత్ర’ నిదర్శనమని ఎపి మంత్రి నారాలోకేష్ అన్నారు. సామాన్యుల ప్రయోజనం కోసం ఈ ఫౌర- కేంద్రీకృత సేవలు విస్తరిస్తూనే ఉంటాయని తెలిపారు. నారా లోకేశ్ మాట్లాడుతూ ‘మన మిత్ర’ ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, తమది ప్రజా ప్రభుత్వం అని పేర్కొన్నారు. ‘‘ప్రజలు ధృవపత్రాలు, ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పౌర సేవలను వేగవంతంగా అందజేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కు కూటమి ప్రభుత్వం నాంది పలికింది. దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఎపి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. మన మిత్ర వాట్సప్ గవర్నర్నెన్స్ సేవలు 200కు పెంచామని తెలిపారు. 200 సేవలు అందించే అద్భుత మైలురాయి సాధించిందని పేర్కొన్నారు. మన మిత్ర కోసం 9552300009కు సందేశం పంపండి’’ అని నారా లోకేష్ కోరారు.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు: నారా లోకేష్
- Advertisement -
- Advertisement -
- Advertisement -