Tuesday, January 21, 2025

హైడ్రా అందరికీ అతీతం

- Advertisement -
- Advertisement -
  • ఆక్రమణలుంటే పార్టీలని కూడా చూడకుండా కూల్చేస్తాం నోటీసులు ఇవ్వకుండానే నేలమట్టం
  • అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు
  • జిఒ 111పరిధిలోకి వెళ్లం 
  • ఒవైసి, మల్లారెడ్డి విద్యాసంస్థలకు కొంత సమయమిస్తాం
  • మన తెలంగాణ ఇంటర్వూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్

మన తెలంగాణ/సిటీ బ్యూరో: చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని.. ఎవరివైనా కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చిచెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని చెరువులన్నింటినీ ఎన్‌ఆర్‌ఎస్‌సి ద్వారా సర్వే చేస్తున్నామని, చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవన్నా రు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం ‘మన తెలంగాణ’తో హైడ్రా కార్యచరణపై ముచ్చటించారు.

సర్వేనెంబర్లను మార్చి అనుమతులను తీసుకున్నవారిపై నా, విచారణ చేపట్టకుండా సృష్టించిన సర్వేనెంబర్లలో అనుమతులు మంజూరు చేసిన ఉద్యోగులపైనా, నియమాలను అతిక్రమించి ఎన్‌ఓసిలు, బిల్డింగ్ పర్మిషన్లను మంజూరు చేసిన అధికారులపైనా కేసులు పెడతామని తెలిపారు. అక్రమాలకు పా ల్పడిన వ్యక్తులపైనా కేసులు నమోదుకు నివేదిక సిద్ధ్దమైందని, అతి త్వరలోనే స్థానిక పోలీసుస్టేషన్లకు నివేదికను అందజేయనున్నట్టు రంగనాథ్ వెల్లడించారు.

కోరితే జన్వాడకు వెళ్తాం
జన్వాడకు హైడ్రా వెళ్ళడంలేదనీ, స్థానిక సంస్థలు కోరితే హైడ్రా వారి పక్షాన చర్య లు తీసుకునే అవకాశాలున్నాయని కమిషనర్ స్పష్టం చేశారు. ఓవైసీ విద్యాసంస్థపై ఫిర్యాదులు వస్తున్నాయనీ, పరిశీలన చేస్తున్నామనీ, అయితే, విద్యాసంస్థ అయినందున విద్యార్థుల అకాడమిక్ ఇయర్‌ను దృష్టిలో పెట్టుకుని పూర్తిస్థాయిలో విచారణ జరిగిన అనంతరం తుది నిర్ణయం ఉంటుందని సూచనప్రాయంగా తెలిపారు. చ ట్టం అందరినీ సమానంగానే చూస్తుందని, సాధారణ ప్రజలకు ఒకరకంగా, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఓరకంగా ఉండదని, హైడ్రా ఆవిర్భావానికి సంబంధించి జీఓ నెం. 99 ప్రకారంగా హైడ్రాకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పడిందనీ, ఆ కమిటీలోని మంత్రులకు లేదా సభ్యులకు సంబంధించిన నిర్మాణాలు చెరువుల్లో ఎఫ్‌టిఎల్‌లో ఉంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తేల్చేశారు. నిర్మాణాలు వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తే మాత్రం వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, నివాసాలుగా ఉంటే వాటిని వారి కష్టార్జితాన్ని దృష్టిలో పెట్టుకుని చూడాల్సి ఉంటుందని రంగనాథ్ ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

జీఓ నెం. 111లోకి వెళ్ళడం లేదు
ఓఆర్‌ఆర్ లోపలివైపున మాత్రమే హైడ్రా చర్యలు తీసుకుంటుందని, జీఓ నెం. 111లోకి ప్రవేశించదనీ, ఏదేని స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసి, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కోరితే హైడ్రా వచ్చి వారిపక్షాన చర్యలు తీసుకునే వీలుంటుందని రంగనాథ్ వివరించారు. చెరువుల ఆక్రమణలపై సైంటిఫిక్ డేటాబేస్ ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తాము తీసుకునే చర్యలకు మద్దతుగానూ, వ్యతిరేకంగానూ కామెంట్లు వస్తున్నాయనీ, రెండింటినీ కూడా పాజిటివ్ కోణంలోనే చూ స్తున్నామన్నారు. నియమాలకు లోబడి చర్యలు ఉంటాయని, ముఖ్యంగా ఎవరివి, ఎంతటి నిర్మాణాలనేది కాకుండా చెరువుల్లోకి వచ్చినాయా? లేదా? అనేది పరిశీలించడం, వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే కన్వెన్షన్, రిజార్ట్, ఫాంహౌస్‌లు, విల్లాలు, ఫంక్షన్‌హాల్స్ వంటి వాటిపైనే ఫోకస్ పెట్టినట్టు రంగనాథ్ తెలిపారు.

నోటీసులు ఇవ్వకుండానే
చెరువుల్లో వెలిసిన అక్రమనిర్మాణాలపై నోటీసులు ఇవ్వకుండానే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ స్పష్టంచేశారు. చెరువులనేవి లివింగ్ రైట్ అని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 పౌరులకు ఇది కల్పిస్తుందనీ, సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని, నోటీసులు ఇవ్వకుండానే నీటి వనరుల్లో నిర్మించిన అక్రమనిర్మాణాలను కూల్చివేయవచ్చని రంగనాథ్ వివరించారు. జీహెచ్‌ఎంసి యాక్ట్‌లోని 405 సెక్షన్ ప్రకారంగా ట్రాఫిక్ ఎంక్రోచ్‌మెంట్స్ ఉంటే నోటీసులివ్వకుండానే తొలగించవచ్చని ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే కార్యనిర్వాహక ఉత్తర్వుల(ఎక్జక్యూటీవ్ ఆర్డర్)ను సంస్థలు అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌ల సమాచారం హెచ్‌ఎండిఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ వెబ్‌సైట్‌లో ఉన్నాయని, త్వరలోనే సాధారణ ప్రజలకు తెలిసేలా వెబ్‌సైట్‌లోనూ చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌ల సర్వేనెంబర్ల వివరాలను పొందుపరచనున్నట్ల్టు చెప్పారు.

త్వరలోనే పోలీసుస్టేషన్
ప్రజలు తమ ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేకంగా ఓ పోలీసు స్టేషన్‌ను హైడ్రా ఏర్పాటు చేయనున్నదనీ రంగనాథ్ తెలిపారు. ఈ పోలీసు స్టేషన్‌లో నియమాలను అతిక్రమించిన, చట్టవిరుద్దంగా అనుమతులు, సర్టిఫికేట్లు జారీచేసిన అధికారులపైనా కేసులు నమోదు చేయడం, విచారణ చేపట్టడం ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు. ముఖ్యంగా చెరువుల్లో కొత్తగా వస్తున్న నిర్మాణాలపై ఫోకస్ పెట్టామని, మూడునాలుగేండ్ల క్రితం నిర్మించిన వ్యక్తిగత ఇండ్లపైనా, ఫ్లాట్లపైనా చర్యలు ఉండవనీ, కొత్తగా నిర్మించే భవనాలు, లేఅవుట్లు, ప్రహారీలపైనే చర్యలు ముందుగా తీసుకోవడం జరుగుతుందన్నారు.

అందులోనూ ప్రజోపయోగకరమైన భవనాలు, వ్యాపారకార్యకలాపాలు నిర్వహించే భవనాలు అనే రెండు కేటగిరీలుగా తీసుకోవడం జరుగుతుందని రంగనాథ్ వెల్లడించారు. 6070 శాతం ఆక్రమణలకు గురైన చెరువుల్లో కొత్తగా వస్తున్న నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ చెరువుల కబ్జాలను వదిలేస్తే మరో 5 ఏండ్లలో అవి కనుమరుగయ్యే ప్రమాదముందని కమిషనర్ పేర్కొన్నారు. గత 50 సంవత్సరాల నుంచి చెరువుల ఆక్రమణలు చోటుచేసుకుంటున్నాయనీ, అయితే, గత ఐదారేండ్ల నుంచి భూములకు ధరలు పెరగడంతో కబ్జాలు, అక్రమనిర్మాణాలు పెరిగాయని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

ఎన్ కన్వెన్షన్‌పై
తమ్మడికుంట చెరువులోని ఎన్‌కన్వెన్షన్ నిర్మాణాలు పూర్తిగా చెరువుల్లోనే ఉన్నాయనీ, పట్టా ఉంటే చెరువులో నీరు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవాలి. నీరు వచ్చినప్పుడు వదిలేయాలనే నియమాలున్నాయేగానీ, శిఖంపట్టాలో నిర్మాణాలు చేపట్టాలనేది ఎక్కడా లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఎన్‌కన్వెన్షన్‌కు నిర్మాణ అనుమతులు గానీ, భవనాల క్రమబద్దీకరణగానీ లేవని రంగనాథ్ స్పష్టంచేశారు. ఫాక్స్ సాగర్, మీర్‌పేట్ చెరువు, అమీన్‌పూర్ చెరువులను పరిశీలిచండం జరుగుతుందని తెలిపారు. చెరువుల ప్రమాదకర పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆయా చెరువుల్లోని అక్రమనిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నామనీ, కానీ, ఈ చెరువు, ఆ చెరువు అనేది తేడాలేదనీ, అన్ని చెరువులపైనా దృష్టిసారించినట్టు ఆయన వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News