Friday, November 15, 2024

మన ఊరు – మన బడితో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ

- Advertisement -
- Advertisement -

మధిర : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా నేడు జరుపుకుంటున్న తెలంగాణ విద్య దినోత్సవ, విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయలపై సభలు కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు దెందుకూరు, రాయపట్నం, మధిర బిసి గరుకుల, కృష్ణాపురం బిసి గురుకులలో జరుగుతున్న కార్యక్రమాలకు హాజరై ప్రభుత్వ పాటశాలలో నూతనంగా మన ఊరు – మన బడి కార్యక్రమం లో బాగంగా నూతనంగా నిర్మించుకున్న అదనపు తరగతి గదులను, డిజిటల్ క్లాస్ రూంలను వంటశాల మౌళిక వసతులను పిల్లలకు టీచర్స్‌కు నూతన బల్లలు మంచి నీళ్ళ ట్యాంక్ ను ప్రారంబించారు.

గురుకులాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించి శాలువాలతో సత్కరించారు ఈ సంధర్బంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎన్నో రంగాలలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందిందని దానిలో భాగంగా విద్యారంగం మరింత అభివృద్ధి పరుగులు పెడుతుందని గురుకుల స్కూల్ ద్వారా, మన ఊరు మనబడి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ ఏర్పడిందని విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కెసిఆర్‌కి రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News