Wednesday, January 22, 2025

మన ఊరు – మన బడిలో ఎంఎల్‌ఎ సండ్ర

- Advertisement -
- Advertisement -

పెనుబల్లి : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు, మనబడి కార్యక్రమాన్ని మంగళవారం మండల పరిధిలోని టేకులపల్లి గ్రామంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికే ఆదర్శం మన ఊరు, మన బడి అని, అందరికీ మెరుగైన, నాణ్యత మైన విద్య అందించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ సంకల్పానికి నిదర్శనం ఈ పధకం అని అన్నారు.

ఈ యొక్క గొప్ప పాఠశాల ప్రారంభించే అవకాశం పొందినందుకు హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన బడి పథకం పెట్టి తెలంగాణ ఈ రోజు విద్యా దినోత్సవం జరుపుతు ప్రభుత్వ రంగంలో ఉన్న 30,000 పాఠశాలలో 10,000 పాఠశాలలకి 7.5 కోట్ల రూపాయలు కేటాయించి మన ఊరు మన బడి కింద గొప్ప విద్య ను అందించి గొప్పగా తయారు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

ఈరోజు పాఠశాలకి కావాల్సిన 12 , 13రకాల మౌళిక సదుపాయాలు ని గుర్తించి వాటన్నింటి పూర్తి చేయటం ఈ పాఠశాలని ఇంత అందంగా తయారు చెయ్యబడిందో దీనికి మించిన ఉదాహరణ ఏది అని చెప్పి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కనగాల వెంకటరావు, భూక్య ప్రసాదు, వంగా నిరంజన్ గౌడ్, జడ్పిటిసి చెక్కిలాల మోహన్‌రావు, ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్ కుమార్, టిఆర్‌ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News