Monday, December 23, 2024

సీటుకో రేటు!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో ఇంజినీరింగ్ యాజమాన్య కోటా సీ ట్ల దందా సాగుతోంది. కొన్ని కాలేజీలు మెరిట్ కు పాతరేసి సీట్లను బహిరంగంగా అమ్ముకుంటున్నాయి. వేలం మాదిరి రోజురోజుకూ డి మాండ్ పెంచి మరీ డొనేషన్లు వసూలు చేస్తున్నా యి. బ్రాంచీని బట్టి ఒక్కో సీటుకు రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్లు వినికిడి. జెఇఇ ర్యాంకు, ఎంసెట్ ర్యాంకులను పట్టించుకోకుం డా ఎవరు ఎక్కువ ఫీజు ఇచ్చేందుకు ముందుకు వస్తే వారికి నచ్చిన సీటు ఇస్తున్నారు. జెఇఇ మెయిన్, ఎంసెట్ రాయనివారికి కూడా మేనేజ్‌మెంట్ కోటా కింద సీట్లు ఇచ్చేస్తున్నారు.

టాప్ ఇంజినీరింగ్‌కాలేజీలు మేన్‌జేమెంట్ సీట్లు ఇం టర్వూ విధానంలో భర్తీ చేస్తున్నట్లు తెలిసింది. మేనేజ్‌మెంట్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కాలేజీకి పి లిచి ఇంటర్వూలు నిర్వహిస్తున్నట్లు సమాచా రం. విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని, వారు యాజమాన్యాలు నిర్ధేశించిన ఫీజు చెల్లిస్తారని నమ్మకం కలిగితేనే సీట్లు ఇస్తారు. యాజమాన్యానికి నమ్మకం కుదరకపోతే సీటు ఇవ్వడానికి నిరాకరిస్తారు. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో కచ్చితంగా మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించే విధానాన్ని అధికారులు అమలు చేయలేకపోతున్నారు.
కన్సల్టెన్సీల మాయాజాలం..
రాష్ట్రంలో ఇటీవల ఎంసెట్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఎంసెట్‌లో ర్యాంకు ఎక్కువగా వచ్చి, కన్వీనర్ కోటాలో నచ్చిన కాలేజీలో నచ్చిన సీటు రాని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనను యాజమాన్యాలు, కన్సల్టెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి. తాము మాట్లాడుకున్న ఫీజు వివరాలు బయటకి చెబితే సీటు పోతుందేమో అని తల్లిదండ్రులు కూడా మేనేజ్‌మెంట్ కోటా ఫీజు విషయాల గురించి ఎవరితో మాట్లాడటం లేదు. వారికి పరిచయం ఉన్న కన్సల్టెన్సీలు, యాజమాన్యాలతో నేరుగా బేరసారాలు జరిపి సీటు పొందుతున్నారు.

దాదాపు అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో సిఎస్‌ఇ, దాని అనుబంద కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డాటా సైన్స్ వంటి బ్రాంచీలకే అధిక డిమాండ్ ఉంది. ద్వితీయ శ్రేణి కాలేజీలు కూడా ఈ బ్రాంచీల సీట్లను రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని కాలేజీ యాజమాన్యాలైతే కన్సల్టెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుని, కమీషన్ ప్రాతిపదికన సీట్లు అమ్ముకుంటున్నట్లు సమాచారం.
కొన్ని కాలేజీల్లోనే పారదర్శక విధానం
రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ ద్వారా భర్తీ కానుండగా, 30 శాతం బీ కేటగిరీ సీట్లను కళాశాలలు భర్తీ చేసుకోవచ్చు. అందులో 15 శాతం యాజమాన్య కోటా, 15 శాతం ఎన్‌ఆర్‌ఐ లేదా ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటా కింద భర్తీ చేసుకోవాలి. యాజమాన్య కోటా సీట్ల భర్తీలో జెఇఇ మెయిన్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాలి. కాలేజీలు తమకు వచ్చిన దరఖాస్తుల్లో జెఇఇ మెయిన్ ర్యాంకర్లు లేకపోతే ఎంసెట్ ర్యాంకర్లకు, వారు లేకపోతే ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేయాలి. ఇందుకోసం ప్రైవేట్ యాజమాన్యాలు కచ్చితంగా నోటిఫికేషన్ జారీ చేసి, విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి.

అలా వచ్చిన విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించాలి. అలా సీట్లు పొందిన విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో లేదా కాలేజీ నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచాలి. ఈ మార్గదర్శకాలను కొన్ని కాలేజీలే పాటిస్తుండగా, మిగతా కాలేజీలు ఇష్టారీతిన సీట్లు అమ్ముకుంటున్నట్లు తెలిసింది. ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు ఎన్‌ఆర్‌ఐలు లేదా ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ విద్యార్థులకు కేటాయించవచ్చు. ఈ సీట్లకు ఏడాది ఐదు వేల డాలర్ల వరకు ఫీజు తీసుకోవచ్చు. ఫీజు ఎక్కువైనా టాప్ కళాశాలల్లో సీటు కావాలనుకునే వారిని ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటా సీట్లు కేటాయిస్తున్నారు.
కంప్యూటర్ సైన్స్‌కు ఫుల్ డిమాండ్
సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌కే విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.అందులోనూ కంప్యూటర్ సైన్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్, డాటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో చేరేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. కంప్యూటర్ సైన్స్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తుండగా, రెండవ ప్రాధాన్యత ఇసిఇకి ఇస్తున్నారు. మెకానికల్, ఇఇఇ, సివిల్ తదితర బ్రాంచీల పరిస్థితి గత ఏడాది ఉన్నట్లుగానే ఉంది. ఎంసెట్‌లో తమకు లభించిన ర్యాంకుకు కన్వీనర్ కోటా కింద టాప్ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్ సీటు లభించని విద్యార్థులు యాజమాన్య కోటా కింద అయినా ఆ బ్రాంచీలో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు.
నోటిఫికేషన్ కంటే ముందు చేపట్టే ప్రవేశాలు చెల్లవు : చైర్మన్ లింబాద్రి
రాష్ట్రంలో షెడ్యూల్ విడుదల చేసిన తర్వాతనే ఇంజినీరింగ్‌లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్. లింబాద్రి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా షెడ్యూల్ విడుదలకు ముందే భర్తీ చేసే సీట్లను చెల్లని వాటిగా గుర్తిస్తామని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే సీట్లను భర్తీ చేయాలని ఆయన ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు సూచించారు. ముందుగా చేసే అడ్మిషన్లను పరిగణలోకి తీసుకోమని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News