Monday, December 23, 2024

వస్త్రాల దొంగతనం?…. కట్టేసి కొట్టి చంపారు… (వీడియో వైరల్ )

- Advertisement -
- Advertisement -

లక్నో: వస్త్ర దుకాణంలో పని చేస్తున్న ఓ యువకుడు బట్టలను దొంగతనం చేశాడని ఆరోపణలతో అతడిని కొట్టడంతో పాటు కరెంట్ షాక్ ఇవ్వడంతో మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాస్ట్రం షాజాన్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. శివమ్ అనే వ్యక్తి గత ఏడు సంవత్సరాల నుంచి బంకిమ్ సూరి అనే బిజినెస్ మ్యాన్ వద్ద సూరి ట్రాన్స్‌పోర్టు విభాగంలో పని చేస్తున్నాడు. వస్త్రాలను రెండు మూడు దుకాణాల వద్దకు సరఫరా చేసేవాడు. ప్యాక్ చేసిన వస్త్రాల బండిల్ కనిపించకపోవడంతో శివమ్ దొంగతనం చేశాడని ఉద్యోగులు ఆరోపణలు చేశారు. దీంతో శివమ్ పట్టుకొని ఒక స్తంభానికి కట్టేసి చితక బాదడంతో స్పృహ తప్పిపడిపోయాడు.

Also Read: కదులుతున్న రైలులో ప్రయాణికుడు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య

శివమ్ కరెంట్ షాక్ ఇవ్వడంతో చనిపోయాడు. వెంటనే మృతదేహాన్ని గవర్నమెంట్ ఆస్పత్రిలో సమీపంలో పడేయాలని సిబ్బందికి యజమాని సూరి సూచించాడు. కన్హయ హోజరీ యజమాని నీరజ్ గుప్త, సూరి ట్రాన్స్‌పోర్టు కంపెనీ యజమాని బంకిమ్ సూరితో పాటు ఐదుగురు కలిసి తన కుమారుడు చంపేశారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శివమ్ తండ్రి అధిర్ జోరీ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడిని కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయని పోలీసులు వెల్లడించారు. శివమ్ వస్త్ర దుకాణంలో బట్టలు దొంగతనం చేశాడని ఒప్పించి పేపర్‌పై బలవంతంగా రాయించుకొని అనంతరం కొట్టి చంపారని అధీర్ జోరి తెలిపాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News