మల్హర్: భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం మానేరు ఒడ్డు ప్రాంతాల్లో, తీగలవాగు, ఆరెవాగు ప్రవాహ ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఉదృతంగా వరద ప్రవహించడంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. తాడిచర్ల, కుంభంపల్లి, పివి నగర్, ఇప్పలపల్లి, మల్లారం, చిన్నతూండ్ల, దుబ్బపేట, దబ్బగట్టు గ్రామాల్లో వరద ఉదృతి నెలకొంది. దీంతో సుమారు 160 వరకు రైతుల ట్రాన్స్‌ఫార్మర్లు కొట్టుకుపోయాయి. వందల సంఖ్యలో విద్యుత్ స్థంబాలు విరిగిపడ్డాయి. కిలోమీటర్లమేర విద్యుత్ వైర్లు తెగిపోయాయి. వేల సంఖ్యలో రైతుల స్టాటర్లు, మోటర్లు, పైపులు కొట్టుక పోయాయి.
వేలాది ఎకరాల్లో రైతుల పొలాలు ఒర్రెలు, ఇసుక మేటలు ఏర్పడి రైతులకు తీవ్ర దుఖఃమిగిల్చింది. మానేరు పై చెక్‌డ్యాంలు నిర్మించడం వల్లనే మానేరు వరద ఒడ్లు ఎక్కి పొలాల గుండా పారుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని మానేరులో పివి నగర్ వద్ద నిర్మంచిన చెక్‌డ్యాంతో చెక్‌డ్యాం పక్క నుండి మానేరు రైతుల పొలాల్లోకి మళ్లి వల్లెంకుంట, కుంభంపల్లి గ్రామాల మీదుగా వరుద అన్నారం బ్యారేజిలో కలవడం జరిగింది. దీంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. వరదలు తగ్గిన తర్వాత వెంటనే వ్యవసాయ విద్యుత్ సరపారాను పునఃరుద్దింలచాని రైతులు కోరుతున్నారు. తీవ్రనష్టాన్ని అంచానా వేసి ఆదుకోవాలని రైతులు కోరతున్నారు.