Sunday, December 22, 2024

మానకొండూర్‌లో పట్టం ఎవరికి?

- Advertisement -
- Advertisement -

రసమయి హ్యాట్రిక్ సాధించేనా..?
బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి, మధ్య త్రిముఖ పోటీ

కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న మానకొండూర్ నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా పరిధిలో తిమ్మాపూర్, గన్నేరువరం, మానకొండూర్, శంకరపట్నం, సిద్దిపేట జిల్లాలో బెజ్జంకి ,రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 18వేల 541 వందల ఓట్లను ఉండగా,పురుషులు 1లక్ష 74 వేల 98 మంది, మహిళలు 1లక్ష 11 వేల 45 ఉన్నారు.ప్రధాన రాజకీయ పార్టీలు సహా ఇండిపెండెంట్ అభ్యర్థులు 10 మంది పోటీలో ఉండగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, మధ్య ముఖాముఖీ గా పోటీ నెలకొంది. బీజేపీ బీఎస్పీ అభ్యర్థులకు పోటీలో ఉన్నప్పటికి బీఆర్‌ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,కాంగ్రెస్ పార్టీ నుండి కవ్వంపల్లి సత్యనారాయణ హోరాహోరీగా తలపడుతున్నారు.

అభివృద్ధే నమ్ముకున్న బిఆర్‌ఎస్ అభ్యర్థి…
రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది మూడవ సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలంగాణ ఉద్యమాల్లో ప్రత్యేక రాష్ట్రం పై అలుపెరుగని పోరాటం చేశాడని 2014 లో టీఆర్‌ఎస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచారు. అనంతరం రాష్ట్ర సాంస్కృతిక సారథి చెర్మన్ గా కొనసాగుతూ, 2018 ఎన్నికల్లో మరో మారు గెలుపొంది, నియోజక వర్గం అభివృద్ధికి అటు కరీంనగర్ మంత్రి గంగులకమలాకర్ సహకారం,ఇటు బెజ్జంకి మండలానికి రూ.127కోట్ల నిధుల మంజూరు కు మంత్రి హరీష్ రావు సహకారంతో మండలంలో రోడ్లు, మహిళ, నూతన గ్రామపంచాయతీ, కుల సంఘాల భవనాలతో అభివృద్ధ్ది దిశలో ఉండగా ఇల్లంతకుంట మండలాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పేరు సంపాదించుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను నమ్ముకొని మూడోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లు ను రసమయి అభ్యర్థిస్తున్నారు. చేసిన అభివృద్ధి మీ కళ్ళముందున్నది. చేయించిన అభ్యర్థి మీ ముందున్నాడని మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.మూడు జిల్లాల మంత్రుల అశిష్యులతో చేసిన అభివుద్ధే తనను గెలిపిస్తుందని రసమయి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ అండ…
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ కవ్వంపల్లి సత్యనారాయణ ఇప్పుడు అదే పార్టీ నుండి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అభయ హస్తం,ఆరు గ్యారెంటీల నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యలను,సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరును విమర్శిస్తూ కవ్వంపల్లి సత్యనారాయణ జోరుగా ప్రచారంలో ముందుకు పోతున్నాడు. గతంలో ఇదే నియోజకవర్గలో ప్రజారాజ్యం పార్టీ నుంచి 2014 లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత2018 లో తెలుగుదేశం పార్టీ నుండి మరోసారి ఓటమి చవిచూసారు.తర్వాత కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూనే, పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గా ఇప్పుడు పార్టీ అభ్యర్థి గా బరిలో నిల్చున్నారు. రసమయి బాలకిషన్ కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం, రెండు సార్లు ఓటమి సానుభూతి కలిసొస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు.

మోడీ సంక్షేమ పథకాలతో బిజెపి అభ్యర్థి…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంక్షేమ పథకాల పని తీరును వివరిస్తూ, మాజీ ఎమ్మెల్యేగా నియోజకవర్గనికి చేసిన అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళుతూ బీజేపీ అభ్యర్థి అరెపల్లి మోహన్ ప్రచారం లో ముందుకు పోతున్నారు. 2014,2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సారు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ అస్సిస్సులతో బీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకొని బీఆర్‌ఎస్ టిక్కెట్ ప్రయత్నం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయికి మరోసారి పార్టీ టిక్కెట్ దక్కడంతో అసంతృప్తి తో ఇటీవల బీజేపీ పార్టీలో చేరి నియోజకవర్గం బీజేపీ టిక్కెట్ దక్కించుకున్నారు. మంచి గుర్తింపు ఉన్న నాయకుడిగా ఇప్పటికే ప్రజలకు సుపరిచితుడు.

గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
బిఆర్‌ఎస్, కాంగ్రెస్, మధ్య రసవత్తరంగా పోటీకి మానకొండూర్ వేదికగా నిలిచింది. ఇద్దరు అభ్యర్థులు ఎవరూ తగ్గకుండా పోటాపోటీగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గా నికి రెండు పార్టీల అగ్రనేతలు కేసీఆర్, రేవంత్ రెడ్డి, ప్రచారంతో కేడర్ లో ఉత్సాహాన్ని నింపారు. ఐతే ఇప్పటి నుండి ప్యాకేజిలు, హామీలతో ఓటర్లును ఆకర్షించుకుంటున్నారు.ఈ ఉత్కంఠకు తెర పడాలంటే డిసెంబర్ 3వరకు ఆగాల్సిందే…

(బి.శ్రీనివాస్/బెజ్జంకి)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News