Sunday, December 22, 2024

మ్యూజికల్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఆకట్టుకుంటున్న’మనమే’ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

డైనమిక్ హీరో శర్వానంద్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’మనమే’ ఈనెల 7వ థియేటర్స్‌లోకి వస్తోంది. శనివారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేశారు. గ్రాండ్‌గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ “మనమే మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ సినిమా. మంచి సినిమా తీశాం. ఈ నెల 7న సెలెబ్రేట్ చేసుకుందాము. మనమే మన తల్లితండ్రులకు అంకితం చేస్తున్న సినిమా. ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే సినిమా” అని అన్నారు.

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ “ట్రైలర్‌లో మీరు చూసింది కొంచమే. సినిమాలో చాలా వుంది. థియేట్రికల్‌గా ఈ సినిమా మోస్ట్ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. ఫ్యాన్స్ పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తారు” అని తెలిపారు. హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ “ట్రైలర్ కంటే ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది సినిమా. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంటతో పాటు అందమైన ఎమోషన్ వుంది. త్రీ జనరేషన్స్ ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళండి చాలా ఎంజాయ్ చేస్తారు” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్, నిర్మాత వివేక్ కూచిభొట్ల, అసోసియేట్ ప్రొడ్యూసర్ ఏడిద రాజా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News