Monday, December 23, 2024

మానాన్న తప్పు చేశాడు… నన్ను క్షమించండి

- Advertisement -
- Advertisement -

చేర్యాల : తన తండ్రి తనకు తెలియకుండా తప్పు చేశాడని, తనను క్షమించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం చేర్యాల పట్టణంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి తనకు తెలియకుండా చేర్యాల పెద్ద చెరువు మత్తడి భూమిలో ఉన్న సర్వే నంబర్ 1399,1400,1401,1402 లో ఉన్న 2 గుంటల భూమిని తన పేరు మీద అక్రమంగా తన సంతకంను పోర్జరీ చేసి తన పేరు మీద రిజిస్టర్ చేశాడని, ఆ భూమిని చేర్యాల ప్రాంత ప్రజలను మోసం చేసి తనకు చేయడాన్ని తప్పు పట్టారు. తన పేరు మీద ఉన్న భూమిని చేర్యాల మున్సిపాలిటీకి రాసిస్తానని హామీ ఇచ్చారు.

అంతకు ముందు చెరువు మత్తడి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రహారి గోడ ప్రతిపక్షాలు, స్థ్ధానికుల సహాయంతో కూల్చివేశారు. తన తండ్రి రెండు సార్లు ఎమ్మెల్యేగా గొప్ప హోదాలో ఉండి 70 సంవత్సరాల వయసులో ఇలాంటి పనులు చేయడం చాలా సిగ్గు చేటని మండిపడ్డారు. ఎమ్మెల్యే కాకముందు తన తండ్రికి వేల కోట్ల ఆస్తి ఉందని, ఇప్పటికి నెలకు కోటిన్నర రెంట్ వస్తున్నాయని అయినా కూడా అక్రమంగా సంపాందికుందామనే భావన సరికాదని తెలిపారు.
సంబరాలు జరుపుకున్న ఆఖిల పక్ష నాయకులు
కొద్ది కాలంగా చేర్యాల పెద్ద చెరువు మత్తడి స్థలాన్ని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన కూతరు తుల్జా భవాని రెడ్డి పేరు అక్రమంగా 23 గుంటల భూమిని కబ్జా చేసాడని ప్రతి పక్షాఉల ధర్నాలు, రాస్తారోకోలు చేసిన విషయం విధితమే అయినప్పటికి ఎమ్మెల్యే కూతురు తుల్జా భవాని రెడ్డి ఆదివారం చేర్యాల పట్టణానికి వచ్చి కంపౌండ్ స్థలాన్ని కూల్చడంతో పాటు, కోర్టు ద్వారా కలెక్టర్ సమక్షంలో చేర్యాల మున్సిపాలిటీకి తన పేరు మీద ఉన్నభూమిని మున్సిపాలిటీకి రాసిస్తానని హామీ ఇవ్వడంతో ప్రతి పక్షాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాణ సంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News