Thursday, December 19, 2024

తండ్రైన ‘బ్రహ్మముడి’ నటుడు రాజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బుల్లితెర నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ నాగులపల్లి తండ్రియ్యాడు. తన భార్య సీమంత పొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన కొద్ది సేపటికే తన భార్య శ్రీజ నిశ్వంకర పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. మానస్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు, ప్రముఖ నటులు ఈ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత సంవత్సరం మానస్ శ్రీజలకు వివాహం జరిగింది, ఈ దాంపత్య బంధానికి గుర్తుగా తాము తల్లిదండ్రులు కాబోతున్నామని కొన్ని నెలల క్రితం మానస్ సోషల్ మీడియాలో చెప్పిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ గా మానస్ నటిస్తున్నాడు. ఆయన నటనతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బుల్లితెరలో మానస్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా హౌజ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. మంచి బిహేవియర్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News