- Advertisement -
’హీరో’ చిత్రంతో గ్రాండ్‌గా డెబ్యూ చేసిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన రెండవ సినిమా ’గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె సాగర్ సహ నిర్మాత కాగా నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.
ఈ చిత్రంలో అశోక్ గల్లాకు జోడీగా మిస్ ఇండియా 2020 మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఆమెను సత్య భామగా పరిచయం చేశారు. ట్రెడిషనల్ గెటప్‌లో హాఫ్ శారీలో ఆమె అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
- Advertisement -